వర్రా రవీంద్రారెడ్డికి రెండు రోజుల పోలీసు కస్టడీ
- సోషల్ మీడియాలో కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు
- వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్
- ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రా
- వర్రాను 10 రోజల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్
- రేపు, ఎల్లుండి మాత్రమే కస్టడీకి అనుమతించిన కడప కోర్టు
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి న్యాయస్థానం రెండ్రోజుల కస్టడీ విధించింది. వర్రా రవీంద్రారెడ్డిని ఈ నెల 13, 14 తేదీల్లో కస్టడీకి అనుమతిస్తూ కడప కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
వర్రా రవీంద్రారెడ్డి నుంచి సమాచారం సేకరించాల్సి ఉందని, అతడిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కడప కోర్టు రెండ్రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పోలీసులకు స్పష్టం చేసింది.
వర్రా రవీంద్రారెడ్డి ప్రసుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో, పులివెందుల పోలీసులు వర్రాను రేపు ఉదయం 9 గంటలకు కస్టడీలోకి తీసుకోనున్నారు.