అమ్మతో హ్యాపీగా.. ట్రెండింగ్‌లో బన్నీ స్పెషల్ ఫొటో..!
- తన తల్లి నిర్మలతో దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న బన్నీ
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
- తమదైనశైలిలో స్పందిస్తున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్
- ఇటీవల 'పుష్ప2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఆనందంలో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ నెల 5న 'పుష్ప-2: ది రూల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకుని, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. దీంతో మున్ముందు మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలాఉంటే... తాజాగా బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ తన తల్లి నిర్మలతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
అద్భుతమైన విజయాన్ని అందుకున్న కుమారుడిని చూసి నిర్మల గర్వంగా ఫీలవుతూ సంతోషంలో కనిపించగా... బన్నీ తన తల్లిని చూసి ఆనందంలో మునిగిపోయినట్లు ఆ ఫొటో ఉంది. "బ్యూటిఫుల్ మార్నింగ్. బిగ్ డే... బ్యూటిఫుల్ స్టార్ట్" అనే లైన్స్‌తో ఐకాన్ స్టార్ ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై బన్నీ ఫ్యాన్స్ తమదైనశైలిలో స్పందిస్తున్నారు.