రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

  • ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న రజనీకాంత్
  • నా ప్రియమిత్రుడు, లెజెండరీ సూపర్ స్టార్ అంటూ చంద్రబాబు ట్వీట్
  • మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన సీఎం
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... 'నా ప్రియ మిత్రుడు, లెజెండరీ సూపర్ స్టార్ రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి. అన్ని ప్రయత్నాల్లో ఆయన విజయపరంపర కొనసాగాలి' అని ట్వీట్ చేశారు. రజనీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.


More Telugu News