శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ విద్యార్ధి ఆత్మహత్య

  • అర్ధరాత్రి హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఇంజినీరింగ్ విద్యార్ధి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఘటన 
  • మృతుడిని ప్రకాశం జిల్లా వాసిగా గుర్తింపు
ఇంజినీరింగ్ విద్యార్ధి హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళంలో జరిగింది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్ధి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి బుధవారం అర్ధరాత్రి కిందకు దూకాడు. 

అతను తీవ్రంగా గాయపడటంతో హాస్టల్ సిబ్బంది, సహచర విద్యార్ధులు హుటాహుటిన శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. మృతుడిని ప్రకాశం జిల్లా వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  



More Telugu News