అధికారమిస్తే అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

  • తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? అని నిలదీత
  • కాంగ్రెస్ పాలనలో అందరూ బాధితులే అయ్యారని విమర్శ
  • బీఆర్ఎస్ తలుచుకుంటే రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాలు ఉండేవా? అని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ లోక్ సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు. నమ్మి అధికారమిస్తే తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆ లేఖలో మండిపడ్డారు. తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? అని రాహుల్ గాంధీని నిలదీశారు.

ఆరు గ్యారెంటీలు సహా ఇచ్చిన హామీలు పత్తా లేకుండా పోయాయన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల నుంచి ఆడబిడ్డల వరకు... వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం వరకు అందరూ బాధితులే అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా నిర్బంధమేనని... అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొందన్నారు.

బీఆర్ఎస్ పదేళ్లలో పేదల బతుకులు మార్చడమే కానీ పేర్లు మార్చలేదన్నారు. కానీ కాంగ్రెస్ అన్నింటినీ మారుస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ తలుచుకుంటే రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాలు ఉండేవా? అని ప్రశ్నించారు. ఇలాంటి సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకుంటే జరగబోయేది అదేనని హెచ్చరించారు.


More Telugu News