అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు.. అతడిని అలా అంటానా: రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ
- 'హరికథ' వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నట కిరీటి సంచలన కామెంట్స్
- వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో అంటూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నటుడి కామెంట్స్
- 'పుష్ప-2' చిత్రాన్ని ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారంటున్న నెటిజన్లు
- ఈ వివాదం ముదరడంతో తాజాగా క్లారిటీ ఇచ్చిన నట కిరీటి
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'హరికథ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన నట కిరీటి.. "నిన్న కాక మొన్న చూశాం. వాడెవడో చందనం దుంగల దొంగ (పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర).. వాడు హీరో. ఇటీవల హీరో పాత్రలకు అర్థాలే మారిపోయాయి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప-2' చిత్రాన్ని ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ వివాదం ముదరడంతో తాజాగా రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
తాను పుష్ప సినిమాపై నెగిటివ్‌గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి మొదట నవ్వుకున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కదా కొత్తగా ఇది వచ్చిందంటూ ఎంజాయ్ చేశానన్నారు. కానీ ఇది చేసింది ఎవరో కానీ వాడికి ఒక్కటే చెబుతున్నాను. అది అల్లు అర్జున్‌ను ఉద్దేశించి అనలేదు అని నట కిరీటి స్పష్టం చేశారు. ఇక బన్నీ తనకు కొడుకు లాంటి వాడని, అతడిని అలా ఎందుకు అంటానని పేర్కొన్నారు. అల్లు అర్జున్ నువ్వు నా బంగారం.. లవ్ యూ అంటూ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.