2025 లో సమంతకు ప్రేమించే భాగస్వామి దొరుకుతాడట.. రాశి ఫలాల సందేశాన్ని పోస్ట్ చేసిన నటి

  • ఏడాదంతా సినిమాలతో బిజీ, పిల్లలను పొందుతారంటూ జాబితా
  • కొత్త ఏడాదిలో ఆ లిస్ట్ లోనివి అన్నీ జరగాలని కోరుకుంటున్న సమంత
  • మీకు అంతా మంచే జరగాలంటూ అభిమానుల కామెంట్లు
కొత్త ఏడాది సరికొత్తగా ఉండాలని, కోరికలు తీరాలని కోరుకోవడం సహజం.. ప్రముఖ నటి సమంత కూడా 2025 ఏడాదికి సంబంధించిన తన కోరికల జాబితాను వెల్లడించింది. తన రాశి వారికి 2025 ఎలా ఉండబోతోందనే వివరాలు ఉన్న ఓ సందేశాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో ఉన్నవన్నీ జరగాలనీ కోరుకుంటున్నట్లు పేర్కొంది. వృషభ, కన్య, మకర రాశి వారు కొత్త ఏడాది మొత్తం బిజీబిజీగా గడుపుతారని, వృత్తిలో మెరుగుపడి బాగా డబ్బు సంపాదిస్తారని ఆ జాబితాలో ఉంది. నమ్మకమైన, ప్రేమించే భాగస్వామి లభిస్తాడని, పిల్లలను పొందుతారని కూడా ఉంది. ఈ పోస్టుపై అభిమానులు స్పందిస్తూ.. మీకు అంతా మంచే జరగాలంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఆ జాబితాలో ఇంకా ఏమున్నాయంటే..
  • ఆర్థికంగా బలంగా ఉంటారు
  • ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు
  • ఆదాయ మార్గాలు పెంచుకుంటారు
  • మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటారు
  • మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉంటారు


More Telugu News