భార్య తనను ఎలా టార్చర్ పెడుతున్నదీ 40 పేజీల లేఖ రాసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అతుల్ సుభాష్
  • సూసైడ్ నోట్‌ను సుప్రీంకోర్టు, హైకోర్టు, తన కార్యాలయ అధికారులు, సిబ్బందికి ఈ మెయిల్
భార్య వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 40 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్ (34) బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లే అవుట్‌లో ఉంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకోగా నిన్న గుర్తించారు.

భర్త అతుల్‌తో గొడవపడిన భార్య యూపీలోని ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు, ఆమెతోనే కలిసి జీవించేందుకు అతుల్ చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో మనస్తాపానికి గురైన ఆయన ఉరివేసుకున్నాడు. ఉరివేసుకోవడానికి మూడు రోజుల ముందు నుంచి ఆ ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఆత్మహత్యకు ముందు అతుల్ రాసిన 40 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసున్నారు. అందులో భార్యతో తాను పడుతున్న ఇబ్బందులు, అనుభవిస్తున్న మానసిక క్షోభ గురించి వివరంగా రాశారు. దీనిని ఈ మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News