పెళ్లిలో అల్లు అర్జున్‌ పాట‌కు శోభిత కిర్రాక్ డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్!

  • ఈ నెల 4న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన శోభిత‌-చైతూ
  • పెళ్లి కూతురిగా ముస్తాబు అవుతున్న స‌మ‌యంలో శోభిత‌ డ్యాన్స్
  • 'స‌రైనోడు' మూవీలోని 'బ్లాకు బ‌స్ట‌రే' అనే పాటకు కాలు క‌దిపిన అక్కినేని కోడ‌లు
అక్కినేని నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ్ల ఈ నెల 4న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా అక్కినేని కోడ‌లు శోభిత‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. వీడియోలో పెళ్లి కూతురిగా ముస్తాబు అవుతున్న స‌మ‌యంలో ఆమె డ్యాన్స్ చేయ‌డం ఉంది. 

అల్లు అర్జున్ న‌టించిన 'స‌రైనోడు' మూవీలోని 'బ్లాకు బ‌స్ట‌రే' అనే పాట‌కు ఆమె కాలు క‌దిపారు. 'శ్ర‌ద్ధా, నాకు పెళ్ల‌వుతోంది.. నాకు సిగ్గేస్తోంది' అంటూ త‌న స్నేహితురాలికి చెబుతూ, అదే స‌మ‌యంలో ఈ పాట ప్లే కావ‌డంతో శోభిత కిర్రాక్ స్టెప్పులు వేశారు. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

దీంతో నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. శోభిత త‌న పెళ్లిని బాగా ఎంజాయ్ చేశారంటూ, చాలా హ్యాపీగా క‌నిపిస్తున్నార‌ని, డ్యాన్స్ సింప్లీ సూప‌ర్బ్ అని కామెంట్స్ చేస్తున్నారు. 


More Telugu News