ముగ్గురు భామల్లో ముందున్న రష్మిక!
- వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక
- 'పుష్ప 2'తో మరోసారి దక్కిన పాన్ ఇండియా హిట్
- టాలీవుడ్ లో తన పొజీషన్ కాపాడుకున్న రష్మిక
- దగ్గరలో కనిపించని పూజ హెగ్డే - కీర్తి సురేష్ సినిమాలు
టాలీవుడ్ లో కొంతకాలం క్రితం వరకూ ముగ్గురు భామల పేర్లు టాప్ త్రీ పొజీషన్లో వినిపిస్తూ వచ్చాయి. ఆ ముగ్గురు నాయికల పేర్లే పూజా హెగ్డే - రష్మిక - కీర్తి సురేశ్. ఈ ముగ్గురిలో పూజా హెగ్డే తెలుగు సినిమాలు చేస్తూ బాలీవుడ్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. కీర్తి సురేశ్ తెలుగులో మెరుస్తూనే కోలీవుడ్ పై శ్రద్ధపెట్టింది. రష్మిక తెలుగుతో పాటు కన్నడ... తమిళ... బాలీవుడ్ పై ఒక లుక్ వేస్తూ వెళ్లింది.
పూజా హెగ్డేకి 'అల వైకుంఠపురంలో' తరువాత హిట్ పడలేదు. ఆ తరువాత ఆమె చేసిన పాన్ ఇండియా సినిమాలు వరుసగా నిరాశ పరుస్తూ వెళ్లాయి. ఆ సినిమాలు హిట్ అయితే ఆమె పరిస్థితి వేరేలా ఉండేది... కానీ దురదృష్టం కొద్దీ అలా జరగలేదు. అలాగే కీర్తి సురేశ్ కి 'దసరా' తరువాత సక్సెస్ రాలేదనే చెప్పాలి. ఆమె ఎంచుకున్న కథలు... పాత్రలే అందుకు కారణం.
ఇక రష్మిక మాత్రం ఈ లోగా బాలీవుడ్ 'యానిమల్... తమిళంలో 'వరిసు'తో తన గ్రాఫ్ ను కాపాడుకుంటూ, 'పుష్ప 2'తో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకుంది. టాలీవుడ్ వరకూ చూసుకుంటే ఈ ముగ్గురు భామల్లో ముందుగా తన పొజీషన్ కి తిరిగొచ్చిన బ్యూటీగా రష్మికనే కనిపిస్తోంది మరి.