పవన్ కల్యాణ్ ఆఫీసుకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్

  • పవన్ పేషీకి నిన్న బెదిరింపు కాల్స్
  • పోలీసులను అప్రమత్తం చేసిన హోంమంత్రి అనిత
  • నిందితుడు నూక మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపేస్తానంటూ ఆయన కార్యాలయానికి ఓ వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తెలిసిందే. ఈ కాల్స్ చేసిన వ్యక్తిని తిరువూరుకు చెందిన నూక మల్లికార్జునరావుగా గుర్తించారు. ఉప ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన హోంమంత్రి అనిత పోలీసులను అప్రమత్తం చేశారు. 

ఈ నేపథ్యంలో, పవన్ కు బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జునరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపం నుంచి పవన్ పేషీకి కాల్ చేసినట్టు గుర్తించారు. అభ్యంతరకర భాషతో కూడిన సందేశం కూడా పంపాడు. తాజాగా అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా కాల్ చేయాల్సి వచ్చింది? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, నూక మల్లికార్జునరావు మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. అతడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు భావిస్తున్నారు.


More Telugu News