కారును దగ్ధం చేసిన మావోయిస్టులు! ఏజన్సీ ఏరియాలో కలకలం
- చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్లే జాతీయ రహదారిలో కారును దగ్ధం చేసిన మవోయిస్టులు
- మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఘటన
- ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీ ఏరియాలో జాతీయ రహదారిపై సరివెల వద్ద మావోయిస్టులు ఓ కారును దగ్ధం చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. చింతూరు వైపు నుండి భద్రాచలం వెళ్లే రహదారి మధ్యలో సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ నెల 2 నుంచి 8 వరకూ మావోయిస్టుల వారోత్సవాలు జరిగాయి. వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే దగ్ధమైన కారు ఎటు నుంచి బయలుదేరింది? ఎంత మంది వ్యక్తులు అందులో ప్రయాణించారు? అనే సమాచారం తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఏజన్సీ ఏరియాలో ఆందోళన రేకెత్తిస్తోంది.