పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు .. తల్లి, ఇద్దరు కుమారుల మృతి

  • విషాదంగా మారిన విహార యాత్ర
  • కారు పంట కాలువలోకి దూసుకుపోవడంతో భార్య, ఇద్దరు పిల్లల గల్లంతు
  • ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన భర్త
  • అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది.  పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. 

పోతవరానికి చెందిన నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. పంట కాలువలో విజయ్ కుమార్ భార్య ఉమ, కుమారులు రోహిత్, మనోజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో విజయ్ కుమార్ భార్య ఉమ కారు డైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. 

స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  


More Telugu News