కోడలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ హామీ

కోడలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ హామీ
  • నవోదయ్ స్కూల్‌ను నారాయణపేటలో ఏర్పాటు చేయాలని కోరిన పర్ణికారెడ్డి
  • నారాయణపేటకు సైనిక్ స్కూల్ వచ్చిందని, ల్యాండ్ ఇస్తే త్వరగా పూర్తి చేస్తామని ఎంపీ హామీ
  • నవోదయ మహబూబ్ నగర్‌లో ఉంటుందని స్పష్టీకరణ
కోడలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి... అత్త, బీజేపీ ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో వీరిరువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్ణికారెడ్డి మాట్లాడుతూ... ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాకు మంజూరైన నవోదయ స్కూల్‌ను నారాయణపేటలో ఏర్పాటు చేయాలని కోరారు. నారాయణపేటను గుర్తుంచుకొని... ఈ స్కూల్‌ను తమకు ఇవ్వాలని కోరారు.

పర్ణికారెడ్డి విజ్ఞప్తిపై డీకే అరుణ స్పందించారు. కోడలు చేతిలో నుంచి మైక్ తీసుకున్న అత్త... నారాయణపేటకు ఇప్పటికే సైనిక్ స్కూల్ వచ్చిందని, అయితే దీని కోసం భూమి ఇప్పిస్తే సాధ్యమైనంత తొందరగా సైనిక్ స్కూల్ ఏర్పాటవుతుందని హామీ ఇచ్చారు. నవోదయ స్కూల్ మహబూబ్ నగర్‌లోనే ఉంటుందన్నారు.


More Telugu News