ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ప్రకటించిన బీజేపీ

  • ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు
  • పార్టీలో చేరిన ఆర్.కృష్ణయ్యకు సముచిత గౌరవం ఇచ్చిన బీజేపీ
  • ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేసిన కృష్ణయ్య
వైసీపీని వీడి బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు ఆ పార్టీ సముచిత గౌరవాన్ని ఇచ్చింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కృష్ణయ్యను బీజేపీ ప్రకటించింది. గతంలో ఆయన వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. మరోవైపు హర్యానా నుంచి రేఖాశర్మను, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ను రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసింది. 

వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు ఆర్ కృష్ణయ్యతో పాటు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు కూడా రాజీనామా చేయడం తెలిసిందే. మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరారు.


More Telugu News