సహ నటిని పెళ్లి చేసుకున్న నటుడు సాయికిరణ్

  • రెండో పెళ్లి చేసుకున్న సాయికిరణ్
  • 'కోయిలమ్మ' సీరియల్ లో కలిసి నటించిన సాయికిరణ్, స్రవంతి
  • ప్రేమ వివాహం చేసుకున్న జంట
'నువ్వే కావాలి' సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన సాయికిరణ్ పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన తన సహ నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఆయన రెండో వివాహం. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సాయికిరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 

గతంలో వైష్ణవి అనే అమ్మాయిని సాయికిరణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఒక అమ్మాయి ఉంది. మనస్పర్థల కారణంగా వీళ్లు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సాయికిరణ్ ఒంటరిగానే ఉంటున్నాడు. 'కోయిలమ్మ' సీరియల్ లో తనతో పాటు నటించిన స్రవంతితో ఆయన ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. కొత్త జంటకు సీరియల్ నటీనటులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 


More Telugu News