అల్లు అర్జున్ పై అమితాబ్ ప్రశంసల జల్లు.. నమ్మలేకపోతున్నానంటూ బన్నీ రిప్లై
- ముంబైలో పుష్ప 2 ప్రచారం సందర్భంగా అమితాబ్ సూపర్ హీరో అన్న బన్నీ
- ఆ వీడియోను షేర్ చేస్తూ అల్లు అర్జున్ వర్క్ కు తాను అభిమానినంటూ బిగ్ బీ కామెంట్
- ఇలాంటి హిట్ లు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నానని శుభాకాంక్షలు చెప్పిన అమితాబ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. బన్నీ పనితీరుకు, ప్రతిభకు తాను అభిమానినంటూ అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన గురించి అల్లు అర్జున్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ అమితాబ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘కృతజ్ఞతలు అల్లు అర్జున్.. నిజం చెప్పాలంటే నేను నీ ప్రతిభకు, నీ పనితీరుకు పెద్ద అభిమానిని. నువ్వు ఇలానే ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఇలాంటి హిట్‌లు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నా. శుభాకాంక్షలు’ అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.
ఇటీవల పుష్ప 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ అమితాబ్ సూపర్ హీరో అని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పారు. బిగ్ బీ అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని, తాను కూడా ఆయన స్ఫూర్తితోనే ముందుకెళుతున్నానని పేర్కొన్నారు. ఈ వీడియోను తాజాగా అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బన్నీపై ప్రశంసల జల్లు కురిపించారు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. ‘మాకందరికీ మీరు సూపర్ హీరో.. మీ నుంచి ప్రశంసలు అందుకోవడం నమ్మలేకపోతున్నా.. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ జవాబిచ్చారు.