ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్.. కొనాలనుకుంటే చక్కటి అవకాశం!

  • ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌పై అదిరిపోయే డీల్స్
  • ఐఫోన్ 15 ప్లస్ ధర ఏకంగా 22 శాతం తగ్గింపు
  • రూ.89,600 విలువైన ఫోన్ రూ.69,900లకే సొంతం చేసుకునే అవకాశం
ఐఫోన్ 15 ప్లస్ కొనాలని ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. మరోసారి ఈ ఫోన్ భారీ తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంది. సెప్టెంబర్‌ నెలలో ఐఫోన్ 16 సిరీస్‌ మోడల్ ఫోన్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడంతో పాత మోడల్ అయిన ఐఫోన్ 15 మోడల్ ఫోన్ల రేట్లు క్రమక్రమంగా తగ్గుతున్నాయి . 2023లో విడుదలైన ఐఫోన్ 15 ప్లస్‌ ఫోన్ ప్రస్తుతం గణనీయమైన తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంది.

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఐఫోన్ 15 ప్లస్ 128జీబీ మోడల్‌పై భారీ ధర తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ అసలు రేటు రూ. 89,600గా ఉండగా ఏకంగా 22 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంటే కేవలం రూ.69,900లకే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి మరో రూ. 4,000 వరకు ఇన్‌‌స్టంట్ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. దీంతో రూ. 64,900లకే కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు దక్కింది. అంతేకాదు, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి మరింత ఆదా చేసుకోవచ్చు.

కాగా ఐఫోన్ 15 ప్లస్ డిస్‌ప్లే 6.7 అంగుళాలుగా ఉంది. డిస్‌ప్లేపై గీతలు పడకుండా గట్టి గాజుతో ప్రొటెక్షన్ ఉంది. నీటిలో తడిసినా ఏమీ కాదు. ఇక ఫోన్‌కు అద్భుతమైన కెమెరా సిస్టమ్‌ ఉంది. హైక్వాలిటీతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవచ్చు. గరిష్ఠంగా 512జీబీ స్టోరేజీ మోడల్ అందుబాటులో ఉంటుంది. కాగా ఐఫోన్ 15 ప్లస్‌ను 5-6 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు. శక్తిమంతమైన ప్రాసెసింగ్ చిప్‌తో పనితీరు బాగానే ఉంటుంది.


More Telugu News