బాక్సాఫీసు వద్ద వైల్డ్ ఫైర్... అల్లు అర్జున్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
- డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 ది రూల్
- వరల్డ్ వైడ్ గా మూడ్రోజుల్లో రూ.621 కోట్ల గ్రాస్
- ఒక్క హిందీలోనే రూ.205 కోట్లు (నెట్)
- బాలీవుడ్ చరిత్రను ఓ తెలుగు డబ్బింగ్ సినిమా తిరగరాసిందన్న వర్మ
- హిందీ మాట్లాడలేని అల్లు అర్జున్ బాలీవుడ్ లో నెంబర్ వన్ హిందీ హీరో అంటూ ట్వీట్
పుష్ప... పుష్పరాజ్... తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మరోసారి సుకుమార్ తో కలిసి చేసిన మ్యాజిక్ బాక్సాఫీసు వద్ద వైల్డ్ ఫైర్ లా వెలిగిపోతోంది. పుష్ప-2 ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
తొలి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తున్న ఈ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ మూవీ మూడ్రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.621 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక్క హిందీ వెర్షన్ తోనే రూ.205 కోట్లు (నెట్) రాబట్టింది. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరంగా స్పందించారు.
బాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు వచ్చిన బిగ్గెస్ట్ సినిమా ఓ డబ్బింగ్ చిత్రమని తనదైన శైలిలో పేర్కొన్నారు. అది కూడా ఓ తెలుగు చిత్రం... పుష్ప-2 అని వివరించారు. అంతేకాదు... హిందీ మాట్లాడలేని అల్లు అర్జున్ ఇప్పుడు బాలీవుడ్ లో చరిత్రలోనే నెంబర్ వన్ హిందీ సినీ యాక్టర్ అని వివరించారు. అందుకే ఇది పాన్ ఇండియా సినిమా ఎంతమాత్రం కాదు... ఇది తెలుగు ఇండియా సినిమా అని అభివర్ణించారు.