చేతి వేళ్లు ఇలా ఉంటే... మద్యం అలవాటు ఎక్కువట!
- పార్టీలు, ప్రోగ్రాముల పేరిట మద్యం తాగేవారు కొందరు...
- నిత్యం మద్యం లేనిదే ఉండలేనివారు మరికొందరు...
- అరుదుగా స్నేహితుల బలవంతంతో తీసుకునేవారు ఇంకొందరు...
- మన చేతి వేళ్ల పరిమాణాన్ని బట్టి వీరిని అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు
ఈ మధ్య కాలంలో చాలా మందిలో మద్యం అలవాటు కనిపిస్తోంది. కొందరు పార్టీలు, ప్రోగ్రాముల పేరిట తాగుతుంటే... మరికొందరు రోజూ లిక్కర్ తీసుకోనిదే ఉండలేకపోతుంటారు. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నా... ఒక చిత్రమైన అంశాన్ని యూకేలోని స్వాన్సియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. చేతి వేళ్లలో ఉంగరం వేలు, చూపుడు వేలు రెండింటి పరిమాణాన్ని బట్టి... మద్యాన్ని ఇష్టపడటం, బానిసగా మారడం వంటివి అంచనా వేయవచ్చని తేల్చారు.
వేళ్ల పొడవులో తేడాలు... ఎందుకలా...!
ఎవరికైనా పుట్టుకతోనే వారి చేతి వేళ్ల పరిమాణం నిర్ధారణ అయిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఉంగరపు వేలు, చూపుడు వేలు రెండింటికీ శరీరంలోని హార్మోన్లతో సంబంధం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయులు ఎక్కువగా ఉన్న వారిలో చూపుడు వేలితో పోలిస్తే... ఉంగరపు వేలు ఎక్కువ పొడవుగా ఉంటుందని గుర్తించారు.
ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం అధికంగా ఉండే వారిలో ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు ఎక్కువ పొడవుగా ఉంటుందని తేల్చారు. రెండు హార్మోన్ల ప్రభావం దాదాపు సమంగా ఉంటే... రెండు వేళ్లు దాదాపు సమానంగా ఉంటాయని గుర్తించారు.
‘‘మద్యం అలవాటు విపరీతంగా పెరిగిపోతోంది. దానికి బానిసగా మారుతున్నవారూ ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ వ్యక్తుల్లో మద్యం అలవాటులో తేడాలు ఏమిటి? దానికి కారణాలు ఏమిటనేది తేల్చేందుకు మా పరిశోధన తోడ్పడే అవకాశం ఉంటుంది” అని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాన్ మ్యానింగ్ తెలిపారు.

- ఇందులో చూపుడు వేలితో పోలిస్తే ఉంగరపు వేలు పొడవు ఎక్కువగా ఉన్నవారికి మద్యం అలవాటు అధికంగా ఉన్నట్టుగా స్వాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.
- అయితే దీనికి కారణం ఏమిటన్నది మాత్రం కచ్చితంగా నిర్ధారణ కాలేదని... టెస్టోస్టిరాన్ తోపాటు ఇతర హార్మోన్ల ప్రభావం కూడా దీనికి కారణమై ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.