టీడీపీలో చేరుతున్నా: వాసిరెడ్డి పద్మ

  • ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ
  • ఈరోజు టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని కలిసిన వైనం
  • వారం రోజుల్లో టీడీపీలో చేరుతానని వెల్లడి
ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సంచలన ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లో తాను టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని ఈరోజు వాసిరెడ్డి పద్మ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

వాస్తవానికి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందినప్పటి నుంచే ఆ పార్టీకి వాసిరెడ్డి పద్మ దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కార్యకర్తలను జగన్ పట్టించుకోలేదని... గుడ్ బుక్ పేరుతో కార్యకర్తలను మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పార్టీని నడిపించడంలో, పాలన చేయడంలో జగన్ కు బాధ్యత లేదని విమర్శించారు.


More Telugu News