జై షా స్థానంలో ఆసియా క్రికెట్ మండలికి కొత్త అధ్యక్షుడు

  • ఆసియా క్రికెట్ కౌన్సిల్  అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన షమ్మీ సిల్వా
  • ఏసీసీ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన షమ్మీ
  • ఏసీసీకి నాయకత్వం వహించడం గొప్ప గౌరవమన్న షమ్మీ
కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే మూడో పర్యాయం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న జై షా ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జై షా స్థానంలో ఏసీసీ అధ్యక్షుడుగా శ్రీలంక క్రికెటర్ షమ్మీ సిల్వా నిన్న (శుక్రవారం) బాధ్యతలు స్వీకరించారు. 
 
సిల్వా గతంలో ఏసీసీ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గానూ పని చేశారు. ఏసీసీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. క్రికెట్ అనేది ఆసియా గుండె చప్పుడని అన్నారు. 

క్రికెట్ అభివృద్ధికి, ప్రతిభకు అవకాశాలు అందించడానికి, అందరినీ ఐక్యంగా ఉంచడానికి సభ్య దేశాలతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కాగా, షమ్మీ సిల్వా మూడు సార్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు.   
 


More Telugu News