పుష్ప-2 వైల్డ్ ఫైరు కాదు వరల్డ్ ఫైరు... తొలి రోజే భారతీయ సినీ రికార్డులు బద్దలు
- అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప-2 ది రూల్
- డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- మొదటి రోజు రూ.294 కోట్లతో చరిత్ర సృష్టించిన సినిమా
- హిందీ సినిమా రికార్డులను కూడా ఓ చూపు చూసిన పుష్ప-2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 చిత్రంతో తెలుగు సినిమా పవర్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా ఓపెనింగ్ డే రోజునే రికార్డులు బద్దలయ్యాయి. భారతీయ సినీ చరిత్రలో తొలి రోజున అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
నిర్మాతలు విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం, ‘పుష్ప-2’ తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. భారత సినీ చరిత్రలో ఇంత వరకు ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రాలేదు. 2022లో రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ తొలి రోజు రూ. 233 కోట్లు వసూలు చేయగా, ఆ రికార్డును ఇప్పుడు ‘పుష్ప-2’ అధిగమించింది.
ఇక హిందీలో రూ.72 కోట్లు వసూలు చేయడం ద్వారా పుష్ప-2 మరో రికార్డు సెట్ చేసింది. ఇప్పటివరకు ఏ హిందీ సినిమా కూడా మొదటి రోజున ఇంత భారీ కలెక్షన్లు రాబట్టింది లేదు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజు వసూళ్లు రూ.65.5 కోట్లు కాగా... ఇప్పుడది పుష్ప-2 దెబ్బకు రెండో స్థానానికి పరిమితమైంది.
ఇక, నైజాంలో తొలి రోజున ఈ చిత్రం రూ.30 కోట్లు వసూలు చేసింది. దాంతో, నైజాంలో ఆర్ఆర్ఆర్ సాధించిన రూ.23 కోట్ల రికార్డు తెరమరుగైంది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం పుష్ప-2 ది రూల్. డిసెంబరు 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజైంది. విడుదలైన ప్రతి సెంటర్ లో బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లకు ఎదురులేకుండా పోయింది.