డే/నైట్ టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట... నిలకడగా ఆసీస్ బ్యాటింగ్
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో రెండో టెస్టు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆలౌట్
- ఆట చివరికి ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 86-1
- బుమ్రాకు ఒక వికెట్
అడిలైడ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆసీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 13 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుట్ కాగా... నాథన్ మెక్ స్వీనీ 38, మార్నస్ లబుషేన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కంగారూలు ఇంకా 94 పరుగులు వెనుకబడి ఉన్నారు. అంతకుముందు, ఈ పింక్ బాల్ డే/నైట్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... మొదటి ఇన్నింగ్స్ లో 44.1 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌట్ అయింది.