ఆర్థిక మోసాలకు ఆర్బీఐ చెక్.. ‘మ్యూల్‌హంటర్.ఏఐ’ టూల్ వచ్చేసింది
- మోసాలకు ఉపయోగించే ‘మ్యూల్ ఖాతా’ల గుర్తింపులో చక్కటి పురోగతి
- ‘మ్యూల్‌హంటర్.ఏఐ’ టూల్‌ని ఉపయోగించాలని బ్యాంకులను ఆర్బీఐ సూచన
- అధునాతన ఆల్గారిథమ్‌తో సులభంగా మోసపూరిత ఖాతాల గుర్తింపు
నేటి డిజిటల్ యుగంలో ఆర్థిక మోసాలను అరికట్టడం ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. కొత్త కొత్త పద్దతుల్లో పుట్టుకొస్తున్న సైబర్ నేరాలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే ఆర్థిక మోసాలకు అడ్డుకట్టవేసేందుకు అధునాతన ఏఐ టూల్ అయిన ‘మ్యూల్‌హంటర్.ఏఐ’ను ఉపయోగించాలని బ్యాంకులను ఆర్బీఐ ప్రోత్సహిస్తోంది. శుక్రవారం ముగిసిన ద్రవ్య విధాన కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు బ్యాంకులకు సూచన చేశారు. దీంతో ‘మ్యూల్‌హంటర్.ఏఐ’ టూల్ ఏంటి? ఇది ఎలా పని చేస్తుందనేది చర్చనీయాశంగా మారింది.
ఆర్బీఐకి సంబంధించిన ఆవిష్కరణల విభాగమైన ‘రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్’ ఈ అధునాతన ఏఐ టూల్‌ని రూపొందించింది. ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఈ సాధనం మంచి ఫలితాన్ని అందిస్తోంది. ఆర్థిక మోసాలను గుర్తించడంలో చక్కగా ఉపయోగపడుతోంది. మనీలాండరింగ్ వంటి మోసాల్లో ఉపయోగించే మ్యూల్ ఖాతాలను ఈ టూల్ కచ్చితత్వంతో, వేగంగా గుర్తిస్తోంది. ఈ అప్లికేషన్‌ను ఇప్పటికే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి.
నిజానికి ఆర్థిక మోసాల కోసం నేరగాళ్లు ఉపయోగించే ‘మనీ మ్యూల్ ఖాతా’లను గుర్తించడం అత్యంత సంక్లిష్టంగా మారింది. ఈ తరహా మోసాలను అరికట్టడంలో ఇదే అతిపెద్ద సమస్యగా ఉంది. ఎలాంటి అనుమానం లేని వ్యక్తుల పేర్ల మీద బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేయించి... నేరగాళ్లు వాటి మధ్య అంతర్గతంగా లావాదేవీలను నిర్వహిస్తుంటారు. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు. ఆర్థిక మోసాలను గుర్తించడం అందుకే సంక్లిష్టంగా మారింది. మోసపోయిన డబ్బును తిరిగి పొందలేకపోవడానికి ఇదే అతిపెద్ద కారణంగా ఉంది. అయితే ‘మ్యూల్ ఖాతాలు’గా పిలిచే వీటిని గుర్తించడంలో ‘మ్యూల్‌హంటర్.ఏఐ’ చక్కటి పురోగతిని చూపిస్తోందని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి.
పలు బ్యాంకులతో కలిసి పనిచేసి మొత్తం 19 వేర్వేరు నమూనాల్లో మ్యూల్ ఖాతాల కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా ఆర్బీఐ గుర్తించింది. అందుకే వీటిని గుర్తించేందుకు వీలుగా ‘మ్యూల్‌హంటర్.ఏఐ’ని అభివృద్ధి చేసింది. అనుమానిత మ్యూల్ ఖాతాలను విశ్లేషించి గుర్తించడంలో ఇది బాగా పనిచేస్తోంది. అధునాతన అల్గారిథమ్ సహకారంతో సాధారణ నియమ-ఆధారిత సిస్టమ్‌ల కంటే అధిక కచ్చితత్వం, ఎక్కువ వేగంతో మ్యూల్ ఖాతాలను అంచనా వేస్తోంది. సంబంధిత ఖాతాల లావాదేవీలు, ఖాతాల డేటాను విశ్లేషిస్తోంది.