వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటన
- రెపో రేటు 6.5 శాతంగా కొనసాగింపు
- వరుసగా 11వ సారి యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం
- ముగిసిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ
- యథాతథంగా కొనసాగనున్న ఈఎంఐలు
ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశం ఇవాళ (శుక్రవారం) ముగిసింది. వరుసగా 11వ సారి కీలకమైన రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ కమిటీ నిర్ణయించింది. 6.5 శాతంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఆరుగురు సభ్యుల కమిటీ 4:2 మెజారిటీతో నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ప్రతి రంగంలో ధరల స్థిరత్వం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా మే 2022 నుంచి వరుసగా ఆరుసార్లు కలిపి మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటుని ఆర్బీఐ పెంచింది. ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రెపో రేటుని పెంచలేదు.
కాగా రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా యథాతథంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈఎంఐలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు.
మందగించిన వృద్ధి
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి పడిపోయిందని ఆర్బీఐ వెల్లడించింది. తయారీ, మైనింగ్ రంగాల వృద్ధి పేలవంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 8.1 శాతంగా నమోదైందని పేర్కొంది.