తనయుడు మోక్షజ్ఞ తొలి చిత్రం షూటింగ్‌పై అప్ డేట్ ఇచ్చిన బాలకృష్ణ
- మోక్షజ్ఞ తొలి చిత్రం షూటింగ్‌పై స్పందించిన నందమూరి బాలకృష్ణ
- అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడిందన్న బాలకృష్ణ
- ప్రజల ఆశీస్సులు, అభిమానుల సపోర్టు మోక్షజ్ఞకు ఉంటాయన్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కధానాయకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. హనుమాన్ మూవీతో సెన్సేషన్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ మొదటి మూవీ రాబోతోంది. ఈ మూవీ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం నిన్న (గురువారం) నిర్వహించేందుకు ప్లాన్ చేసినప్పటికీ అనివార్య కారణాలతో కార్యక్రమం రద్దు అయింది.
దీనిపై నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. కాకినాడలో ప్రముఖ ఆభరణాల నూతన షోరూం ప్రారంభోత్సవంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మోక్షజ్ఞ మూవీపై మీడియా ప్రశ్నించగా, ఆయన సమాధానమిచ్చారు. మోక్షజ్ఞ సినిమా మొదలు పెట్టాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. అంతా మనమంచికే అని అనుకోవడం తప్పితే వేరే ఏమి లేదన్నారు. ప్రజల ఆశీస్సులు, అభిమానుల సపోర్టు మోక్షజ్ఞకు ఎప్పుడూ ఉంటాయని బాలయ్య అన్నారు.