అల్లు అర్జున్.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది: ప్రకాశ్ రాజ్
- బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తున్న 'పుష్ప-2'
- అల్లు అర్జున్ నటనపై పలువురి ప్రశంసలు
- అల్లువారబ్బాయిని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాశ్ రాజ్
- బన్నీ స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారని కితాబు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం 'పుష్ప-2' బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బన్నీ తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేశారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా అల్లువారబ్బాయిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారని కొనియాడారు. అలాగే పుష్ప చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.
"గంగోత్రి నుంచి పుష్ప-2 వరకూ చూస్తున్నాను. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న తీరు అత్యద్భుతం. చాలా గర్వంగా ఉంది. ఇలాగే మరింత ముందుకెళ్లండి. మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్. మాంత్రికుడు సుకుమార్‌కి స్పెషల్ లవ్" అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.