శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-59

  • యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్
  • ఈ సాయంత్రం 4.04 గంటలకు ముగిసిన కౌంట్ డౌన్
  • నిప్పులు చిమ్ముతూ రోదసికి ఎగిసిన పీఎస్ఎల్వీ-సి59
యూరప్ కు చెందిన పలు ఉపగ్రహాలను మోసుకుంటూ పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. ఈ సాయంత్రం 4.04 గంటలకు కౌంట్ డౌన్ ముగియగా... పీఎస్ఎల్వీ-సి59 వాహకనౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 

ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి. కరోనా అనేది అత్యంత ప్రకాశవంతమైన భాగం కావడంతో... ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రోబా-3 శాటిలైట్లకు రూపకల్పన చేశారు. కృత్రిమ సూర్య గ్రహణాలను సృష్టించి కరోనాపై పరిశోధనలు సాగించడం ప్రోబా-3 ప్రత్యేకత.


More Telugu News