నెట్‌ఫ్లిక్స్‌కు 'పుష్ప 2' ఓటీటీ రైట్స్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే...!
- ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'పుష్ప 2'కి పాజిటివ్ టాక్
- ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం మేకర్స్‌తో నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్
- సంక్రాంతి తర్వాతే సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్-రష్మిక మందన్న జంటగా వచ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో మూవీ అదరగొడుతోంది. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక మూడేళ్ల తర్వాత బన్నీ సినిమా రావడం, అందులోనూ క్రేజీ సీక్వెల్ కావడంతో సినీ అభిమానులు పుష్ప 2 థియేటర్లకు పోటెత్తుతున్నారు. హిట్ టాక్ రావడంతో రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీ అని సినిమా చూసిన వారు చెబుతున్నమాట.
కాగా, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం పుష్ప 2 మేకర్స్ తో సుమారు రూ. 250 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ సంక్రాంతి తర్వాతే ఉండవచ్చని తెలుస్తోంది.
థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత తమ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.