పుష్ప2పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర స్పందన

  • పుష్ప అంటే వైల్డ్‌ఫైర్ కాదన్న అంబటి
  • పుష్ప అంటే వరల్డ్ ఫైర్ అంటూ ప్రశంసలు
  • ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆసక్తికర స్పందన
అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పుష్ప2’ థియేటర్లలో సందడి చేస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇవాళ (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌‌తో సినీ అభిమానులను అలరిస్తోంది. అల్లు అర్జున్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడిందని అభిమానులు మురిసిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా పుష్ప2 మూవీపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక అంబటి రాంబాబు స్పందించారు.

పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘పుష్ప అంటే వైల్డ్‌ఫైర్ అనుకుంటివా. కాదు. వరల్డ్ ఫైర్’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఎక్స్ వేదికగా స్పందించారు. తన ట్వీట్‌కు ఫైర్ ఎమోజీని ఆయన జోడించారు. సినిమా విడుదలైన నేపథ్యంలో ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.

కాగా పుష్ప2పై కొందరు పనిగట్టుకొని కుట్రలు చేస్తున్నారంటూ రెండు వారాలక్రితం అంబటి రాంబాబు అన్నారు. కావాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ అడ్డుకోలేరని సవాలు చేశారు. అల్లు అర్జున్ ఒక ఇంటర్నేషనల్ స్టార్ అని అంబటి ప్రశంసల జల్లు కురిపించారు. తాను కూడా పుష్ప2 సినిమా చూడడానికి సిద్ధంగా ఉన్నానంటూ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే.


More Telugu News