లగచర్లను సందర్శించే హక్కు లేదా?: రాహుల్ గాంధీకి హరీశ్ రావు ప్రశ్న
- లగచర్లకు వెళ్తుండగా మధుసూదనాచారిని అడ్డుకున్నారని ఆగ్రహం
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజ్యాంగ విలువలకు స్థానం లేదని విమర్శ
- సిగ్గుపడాల్సిన విషయమంటూ ఆగ్రహం
సంభాల్ ను సందర్శించడం లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హక్కు అయితే, లగచర్లను సందర్శించే హక్కు మధుసూదనాచారికి లేదా? అని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. లగచర్లకు వెళ్తుండగా మధుసూదనాచారిని అడ్డుకోవడాన్ని ప్రశ్నించారు.
ఆయన లగచర్లకు వెళ్తుండగా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజ్యాంగ విలువలకు స్థానం లేదని మండిపడ్డారు. సంభాల్కు రాహుల్ గాంధీ వెళ్లవచ్చు... కానీ లగచర్లకు తాము వెళ్లవద్దట.. ఇది సిగ్గుపడాల్సిన విషయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.