'పుష్ప-2' సినిమాలో ఎవరెవరు... ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే!

  • కొన్ని గంటల్లో 'పుష్ప-2' బెనిఫిట్ షోలు
  • లాభాల్లో వాటా తీసుకున్న అల్లు అర్జున్
  • బన్నీకి రూ. 280 కోట్ల వరకు అందినట్టు సమాచారం
అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' చిత్రం బెనిఫిట్ షోలు కాసేపట్లో పడనున్నాయి. రాత్రి 9.30 గంటలకు తొలి బెనిఫిట్ షో పడబోతోంది. మరోవైపు, బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. థియేటర్ల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. 

ఈ చిత్రంపై అన్ని చోట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 80 దేశాల్లో 6 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. 

మరోవైపు ఈ సినిమాలో రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నాయి. రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో షేర్ తీసుకోవాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్ రూ. 270 నుంచి 280 కోట్లు అందుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సుకుమార్ కూడా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. నిర్మాత, దర్శకుడిగా ఆయన రూ. 100 కోట్లకు పైగానే అందుకున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ రష్మికకు రూ. 10 కోట్లు, ఫహాద్ ఫాజిల్ కు రూ. 8 కోట్లు, ఐటెం సాంగ్ చేసిన శ్రీలీలకు రూ. 2 కోట్లు ఇచ్చారట. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు రూ. 5 కోట్లకు పైగానే ఇచ్చినట్టు సమాచారం. 


More Telugu News