పార్టీ రాష్ట్ర స్థాయి నేతలతో కాసేపట్లో భేటీ కానున్న జగన్

  • కాసేపట్లో వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం
  • పార్టీని బలోపేతం చేసే అంశంపై దిశానిర్దేశం చేయనున్న జగన్
  • పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించనున్న నేతలు
వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం కాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో భాగంగా పార్టీని బలోపేతం చేసే అంశంతో పాటు, కూటమి ప్రభుత్వంపై ప్రజా పోరాటం ఎలా చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. 

పార్టీకి సంబంధించిన కమిటీల ఏర్పాటు గురించి చర్చించనున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, కార్యదర్శులు హాజరుకానున్నారు.


More Telugu News