అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరండి.. కెనడా ప్రధానికి ట్రంప్ చురకలు

  • ట్రంప్‌తో భేటీ అయిన కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో
  • వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాకు సరిహద్దులోనే చెక్ పెట్టాలన్న ట్రంప్
  • లేదంటే సుంకాలు తప్పవని హెచ్చరిక
వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేస్తారా? లేదంటే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరుతారా? అంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోకు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చురకలు అంటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్టు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీంతో కలవరపాటుకు గురైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెంటనే అమెరికాలో వాలిపోయి ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడం చేయాలని, లేదంటే సుంకాలు పెంచాల్సి వస్తుందని ఈ సందర్భంగా ట్రూడోను ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు, ఈ విషయంలో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని చురక అంటించారు. కాగా, ఈ భేటీపై ట్రంప్ స్పందిస్తూ.. చర్చలు ఫలవంతమైనట్టు చెప్పారు.


More Telugu News