అక్కినేని ఇంట పెళ్లి సందడి... ఆ కారు శోభిత కోసమే కొన్నారా?

  • ఈరోజు అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో చైత‌న్య‌-శోభిత‌ల వివాహం
  • ఈ పెళ్లికి హాజ‌రు కానున్న‌ సినీ, రాజ‌కీయ రంగానికి చెందిన ప్ర‌ముఖులు
  • ఇటీవ‌ల రూ. 2 కోట్లు పెట్టి ట‌యోటా లెక్స‌స్ కారును కొనుగోలు చేసిన నాగ్ 
  • ఈ కారును శోభిత‌కు గిఫ్ట్‌గా ఇవ్వడానికే తీసుకున్నార‌ని టాక్  
మ‌రికొన్ని గంటల్లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ్ల జంట వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌నున్నారు. ఈరోజు హైదరాబాదులోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో చైతూ, శోభిత పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఈ వివాహ వేడుక‌కు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక పెళ్లికి సినీ, రాజ‌కీయ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌కానున్నారు. 

ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, అల్లు అర్జున్ స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ వేడుక‌కు హాజ‌రవుతార‌ని స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. ఇక చైత‌న్య‌-శోభిత‌ల వివాహ వేడుక పూర్తి హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గ‌నుంది. సుమారు ఏడెనిమిది గంట‌ల పాటు పెళ్లికి సంబంధించిన అన్ని క్ర‌తువులు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి నిర్వ‌హిస్తార‌ట‌.

ఇదిలాఉంటే.. ఈ పెళ్లి సంద‌ర్భంగా ఇంటికి రాబోయే కోడ‌లికి నాగార్జున ఖ‌రీదైన బ‌హుమ‌తి ఇవ్వ‌బోతున్నార‌ని కుటుంబ స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల నాగ్ రూ. 2 కోట్లు పెట్టి ట‌యోటా లెక్స‌స్ కారును కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. దీనిని శోభిత‌కు గిఫ్ట్‌గా ఇవ్వడానికే తీసుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది.  


More Telugu News