చిన్న చేపను నోటికిస్తే చేతినే కొరికేయబోయిన డేంజరస్‌ ఫిష్‌.. వైరల్‌ వీడియో!

  • పెద్ద కళ్లు, ముళ్లలాంటి పళ్లతో భయం గొలిపేలా ఉన్న ‘సీ డెవిల్‌’ చేప
  • దానికి చిన్న చేపను తినిపించబోతే... ఒక్కసారిగా కొరికేసిన తీరు
  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌... గంటలోనే లక్షకుపైగా వ్యూస్‌
అదో చేప... పెద్ద పెద్ద కళ్లతో... ఫిరానా చేపల్లా ముళ్లలాంటి పళ్లతో భయం గొలిపేలా ఉంది. ఓ జాలరి వలకు చిక్కింది. దాన్ని బోటు డెక్‌ పై వేసిన జాలరి... అది నోరు బారెడు తెరుచుకుని ఉండటం చూసి, ఓ చిన్న చేప పిల్లను తినిపించడానికి ప్రయత్నించాడు. చేప పిల్లను దగ్గరికి తెచ్చేదాకా అసలేమాత్రం కదలకుండా ఉన్న పెద్ద కళ్ల చేప... ఒక్కసారిగా దాన్ని దొరకబుచ్చుకుంది.

చేతిని కూడా అందుకునేలా...
చేప పిల్లనే కాదు... అదే వేగంతో చేతిని కూడా అందుకునేలా కసుక్కున కొరికి పట్టుకుంది పెద్ద చేప. కానీ కాస్త కిందికి జారి జాలరి చేతికి ఉన్న గ్లోవ్‌ దాని నోటికి చిక్కింది. దాంతో జాలరి ఆ పెద్ద చేపను పైకి లేపి... నీటిలో పడేయడానికి ప్రయత్నించాడు. గ్లవ్స్‌ కు గుచ్చుకున్న పదునైన పళ్ల నుంచి బయటపడేందుకు కాస్త విదిలించాడు. దానితో పెద్ద చేప కాస్త నోరు తెరిచింది. మెల్లగా నీటిలో పడిపోయింది.

ఇంతకీ ఏం చేప అది?
  • ఈ చేప పేరు మాంక్‌ ఫిష్‌. సాధారణంగా సీ డెవిల్‌ అని పిలుస్తుంటారట. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.
  • ‘పొరపాటున కూడా ఈ చేప కనబడితే దానికి ఏమీ తినిపించడానికి ప్రయత్నించవద్దు’ అని హెచ్చరిక కూడా చేశారు. 
  • ఎందుకంటే... దాని పళ్లు చాలా పదునుగా ఉన్నాయి. కొరికితే మన వేళ్లు కూడా తెగిపోవడం ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి.
  • సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేయగా... కేవలం గంటలోనే లక్షకుపైగా వ్యూస్‌ రావడం గమనార్హం. ఇక లైకులు, కామెంట్లు అయితే పోటెత్తుతున్నాయి.


More Telugu News