జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఫైర్
- అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్న పెద్దారెడ్డి
- వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని వ్యాఖ్య
- తనను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపాటు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. జేసీ వ్యాఖ్యలపై తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. వెంకట్రామిరెడ్డిపై జేసీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆయన అన్నారు.
జేసీ వర్గీయులు తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా, పేకాట ఆడిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. తనను కూడా తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికారం ఉందని ఏమి చేసినా చెల్లుతుందని అనుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.