"సీజ్ ద షిప్"... వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

  • ఇటీవల కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ చెకింగ్
  • స్టెల్లా అనే నౌకలో తనిఖీలు
  • రేషన్ బియ్యం తరలిపోతుండం పట్ల పవన్ ఆగ్రహం
  • "సీజ్ ద షిప్" అంటూ స్పాట్ లోనే ఆదేశాలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొన్ని రోజుల కింద కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రేషన్ బియ్యం అక్రమ తరలింపును గుర్తించారు. ఆయన కాకినాడ నుంచి ఆఫ్రికా వెళుతున్న స్టెల్లా అనే నౌకను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించి "సీజ్ ద షిప్" అంటూ ఆదేశాలు జారీ చేశారు. పోర్టు ఉన్నది స్మగ్లింగ్ చేసుకోవడానికా... మీ బాస్ కు తెలుసా... ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడో? ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అంటూ నౌక సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత మంత్రులకు భిన్నంగా స్పాట్ లోనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా పవన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 

కాగా, పవన్ "సీజ్ ద షిప్" అంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలను జనసైనికులు, పవన్ అభిమానులు విపరీతంగా లైక్, షేర్ చేస్తున్నారు. 

అటు, పవన్ ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.  పవన్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు, పౌరసరఫరాల శాఖ, పోర్టు, కస్టమ్స్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ తాజాగా మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశారు. 


More Telugu News