కాకినాడ పోర్టులోని షిప్ లోకి రేషన్ బియ్యం ఎలా చేరిందో తేలుస్తాం: జిల్లా కలెక్టర్ షాన్ మోహన్
- కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యం!
- విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తామన్న జిల్లా కలెక్టర్
- తనిఖీలకు విధివిధానాలను రూపొందిస్తున్నామని వెల్లడి
కాకినాడ పోర్టులో ఉన్న స్టెల్లా షిప్ లోకి రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తేలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఏ గోదాం నుంచి బియ్యం వచ్చాయో పరిశీలిస్తామని చెప్పారు. షిప్ లో బియ్యం మొత్తం పేదల బియ్యమేనా అనేది కూడా చూస్తామని తెలిపారు. కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
ఈ అంశంపై ఐదుగురు సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తామని షాన్ మోహన్ చెప్పారు. ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు, పౌరసరఫరాల శాఖ, కస్టమ్స్, పోర్టు అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతి లోడ్ ను పరిశీలించి... బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో విచారిస్తామని చెప్పారు. తనిఖీలకు విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ఎవరైనా 7993332244 నంబర్ కు ఫోన్ చేసి తమను సంప్రదించవచ్చని చెప్పారు.