బంగ్లాదేశ్ హిందూ పూజారి కృష్ణదాస్ లాయర్ పై దాడి.. మిగతా లాయర్లపై తప్పుడు కేసులు
- దేశద్రోహం ఆరోపణలతో ఇస్కాన్ పూజారి చిన్మయ్ కృష్ణదాస్ ను జైలుకు పంపిన బంగ్లా ప్రభుత్వం
- మంగళవారం బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉండగా ఆయన లాయర్ పై దాడి
- చిన్మయ్ తరఫున వాదించేందుకు లాయర్లు లేకపోవడంతో విచారణ వాయిదా
దేశద్రోహం ఆరోపణలతో జైలుకు పంపిన హిందూ పూజారి చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి తరఫున వాదించేందుకు లాయర్లు ముందుకు రావడంలేదు. ఇప్పటికే ఆయన తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లాయర్ పై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగుల దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గాయాల కారణంగా ఆ లాయర్ ఆసుపత్రి పాలయ్యాడు. ఈ దాడి నేపథ్యంలో మిగతా లాయర్లు ఎవరూ ఆయన తరఫున వాదించేందుకు ముందుకు రాలేదు. వాస్తవానికి చిన్మయ్ బెయిల్ పిటిషన్ పై మంగళవారం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. వాదించేందుకు లాయర్ లేకపోవడంతో చిన్మయ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది. దీంతో అప్పటి వరకూ చిన్మయ్ జైలు జీవితం గడపాల్సిందే.
చిన్మయ్ కృష్ణదాస్ పై ప్రభుత్వం కక్షగట్టిందని, ఆయన తరఫున వాదించకుండా దాదాపు 70 మంది లాయర్లపై తప్పుడు కేసుల్లో ఇరికించిందని బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ జోట్ ఆరోపించింది. ఈమేరకు బంగ్లాదేశ్ కు చెందిన ది బిజినెస్ స్టాండర్డ్ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఛట్టోగ్రామ్ పోలీస్ స్టేషన్ లో హిందూ లాయర్లపై ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిందని, దీంతో వారు కోర్టులో వాదించే అర్హత కోల్పోయారని పేర్కొంది. ఓ రాజకీయ గ్రూపుకు సంబంధించిన వ్యక్తులు హిందూ లాయర్లను వేధింపులకు గురిచేస్తున్నారని, చిన్మయ్ తరఫున వాదించకుండా బెదిరిస్తున్నారని ఆరోపించింది.