చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేేటీ
- పలు కీలక అంశాలపై చర్చిస్తున్న మంత్రివర్గం
- టూరిజం పాలసీకి ఆమోదముద్ర వేయనున్న కేబినెట్
- సీఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ టెక్స్ టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ, ఆర్టీజీని పునర్వ్యవస్థీకరించే అంశం, మారిటైం పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. 41వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి అయిన డిసెంబర్ 15వ తేదీని ఆత్మార్పణ దినోత్సవంగా జరిపేందుకు ఆమోదం తెలపనున్నారు.