పవన్‌కు అమిత్ షా ప్రశంసలు

  • పవన్ కల్యాణ్‌ను క్రౌడ్‌పుల్లర్‌గా అభివర్ణించిన కేంద్రమంత్రి అమిత్ షా
  • మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్ధుల గెలుపు 
  • తమ గెలుపులో పవన్ కల్యాణ్‌ భాగస్వామ్యమయ్యారన్న అమిత్ షా
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని మహాయుతి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో సభలకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్ధులు విజయం సాధించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను ప్రజాకర్షక నేత (క్రౌడ్‌పుల్లర్)గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అభివర్ణిస్తూ ప్రశంసించారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి అభ్యర్ధులు గెలిచారన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాను లోక్ సభలో జనసేన పక్ష నాయకుడు బౌలశౌరి నిన్న ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. 

మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆదరణతో తమ గెలుపులో పవన్ కల్యాణ్‌ భాగస్వామ్యమయ్యారని అమిత్ షా ప్రశంసించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించినందుకు బాలశౌరి అమిత్‌ షాకు అభినందనలు తెలిపారు.    


More Telugu News