మా తలరాతలు మార్చిన మీరే ఈ ప్రభుత్వాన్ని కూడా కాపాడుకోవాలి!: సీఎం రేవంత్ రెడ్డి
- పది నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? అన్న సీఎం
- ప్రభుత్వంపై జరుగుతోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు
- తెలంగాణ సమాజమే మా కుటుంబమన్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలే అవుతోందని, ఈ పది నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? అయినా ఈ కాలంలో మనం చేయాల్సింది చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు.
ఈ ప్రభుత్వం కష్టం మీద వచ్చిందని చెప్పడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం ద్వారా మా తలరాతను మార్చి పెద్ద బాధ్యతలు ఇచ్చారని, కాబట్టి విషప్రచారాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీదే అన్నారు. నల్లచట్టాలు తెచ్చిన మోదీ, వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
213 అంబులెన్స్‌లు ప్రారంభం
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో గల హెచ్ఎండీఏ మైదానంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 213 అంబులెన్స్‌లను ప్రారంభించారు. 108, 102 వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత విద్య, వైద్యం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ రెండింటిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఏడాదిలోపు తమ ప్రభుత్వం వైద్యశాఖలో 14 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. వైద్య శాఖ బలోపేతమైతేనే ఆరోగ్య తెలంగాణ నిర్మాణమవుతుందన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున వైద్య శాఖలో ఎవరూ భర్తీ చేయలేదన్నారు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.
తెలంగాణ సమాజమే మా కుటుంబం
తెలంగాణ సమాజమే తమ కుటుంబం అనుకొని తాము ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ ఎనిమిది మెడికల్ కాలేజీలను ఇచ్చి కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. పరీక్షలు వాయిదా వేయమని చాలామంది డిమాండ్ చేశారని, కానీ విద్యార్థుల విలువైన సమయం వృథా అవుతుందని అలా చేయలేదన్నారు. కానీ గత ప్రభుత్వం పలుమార్లు వాయిదా వేసిందన్నారు.
గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నదని... తాము మాత్రం పంటలు వేసేలా ప్రోత్సహించామన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంతమందికి భయం పట్టుకుందన్నారు. సంక్రాంతికి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు కొంతమంది వస్తారని, కానీ వారు వచ్చేది పంచాయతీ ఎన్నికల కోసమే అన్నారు.
మేం పని మీద దృష్టి సారించాం
సీఎంగా తన పనిని ఆపి పక్కన పెడితే... అభివృద్ధి ఆగిపోతుందన్నారు. అందుకే తాను పని మీద దృష్టి సారించానన్నారు. మీరు (కార్యకర్తలు, ప్రజలు) భుజాలపై మోస్తేనే తాము అధికారంలో కూర్చున్నామన్నారు. మాకు కుర్చీ రావడానికి కారణం ఈ ప్రజలు, కార్యకర్తలే అన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే అన్నారు. అందుకే ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే బాధ్యత కూడా మీదేనని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు.