పవన్ కల్యాణ్, షర్మిలపై బొత్స సత్యనారాయణ విమర్శలు
- పవన్ తీరు చూస్తుంటే గబ్బర్ సింగ్-3 గుర్తుకు వస్తోందన్న బొత్స
- బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని ప్రశ్న
- షర్మిలను ఒక పార్టీ నాయకురాలిగా తాము గుర్తించడం లేదని వ్యాఖ్య
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం స్మగ్లింగ్ అవుతోందని పవన్ అంటున్నారని... స్మగ్లింగ్ చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని ప్రశ్నించారు. పవన్ తీరు చూస్తుంటే గబ్బర్ సింగ్-3 గుర్తుకు వస్తోందని అన్నారు.
మంత్రి ప్రమేయం లేకుండానే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయా? అని ప్రశ్నించారు. పవన్ చిత్తశుద్ధిని తాను శంకించడం లేదని చెప్పారు. 2004లో మంత్రి అయినప్పుడు తనకు ఎన్నో అధికారాలు ఉంటాయని భ్రమ పడ్డానని తెలిపారు. మంత్రి పదవి వచ్చినప్పుడు తొలుత 'హూ' అంటామని... ఆ తర్వాత 'ఆ' అంటామని చెప్పారు.
షర్మిల ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా మాట్లాడటం లేదని బొత్స అన్నారు. ఆమెను మీరు గుర్తిస్తున్నారేమో కానీ, తాము మాత్రం గుర్తించడం లేదని చెప్పారు. పీసీసీ చీఫ్ గా పలు అంశాలపై మాట్లాడాలని, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదని అన్నారు. గతంలో తాను కూడా పీసీసీ అధ్యక్షుడిగా పని చేశానని గుర్తు చేసుకున్నారు.