వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఈరోజు శుభదినం: పొన్నవోలు సుధాకర్ రెడ్డి
- ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న పొన్నవోలు
- భార్గవరెడ్డికి అరెస్ట్ నుంచి రెండు వారాల పాటు సుప్రీంకోర్టు రక్షణ కల్పించిందని వ్యాఖ్య
- సోషల్ మీడియా కార్యకర్తలకు సెక్షన్ 111 వర్తించదన్న పొన్నవోలు
వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవరెడ్డిని రెండు వారాల పాటు అరెస్ట్ చేయవద్దని ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని భార్గవరెడ్డికి సూచించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఈరోజు శుభదినమని పొన్నవోలు చెప్పారు. ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. భార్గవరెడ్డి తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని... అయనకు అరెస్ట్ నుంచి రెండు వారాల పాటు సుప్రీంకోర్టు రక్షణ కల్పించిందని చెప్పారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే వెసులుబాటు కల్పించిందని తెలిపారు.
సెక్షన్ 111ను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పొన్నవోలు మండిపడ్డారు. 2004 జులై 1వ తేదీకి ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ 111 వర్తించదని చెప్పారు. సెక్షన్ 111 పెట్టాలంటే ముద్దాయిపై రెండు ఛార్జిషీట్లు ఉండాలని అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు ఈ సెక్షన్ కిందకు రారని చెప్పారు.