స్టెల్లాను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్ స్టార్ షిప్ ను ఎందుకు వదిలేశారు?: పేర్ని నాని
- ఆర్థికమంత్రి వియ్యంకుడి బియ్యం ఆ షిప్ లో ఉందన్న పేర్ని నాని
- ఆ షిప్ లోకి వెళ్లవద్దని పవన్ కు చంద్రబాబు చెప్పారా? అని ప్రశ్న
- అరబిందో సంస్థ ప్రస్తావనను పవన్ ఎందుకు తెచ్చారన్న పేర్ని నాని
కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం అక్రమంగా తరలిపోతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డ సంగతి తెలిసిందే. పవన్ కాకినాడ పర్యటన గురించి వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ... స్టెల్లా షిప్ ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్ స్టార్ షిప్ ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థికమంత్రి వియ్యంకుడు ఆ షిప్ లో బియ్యం తరలిస్తున్నారనే సమాచారం ఉందని చెప్పారు.
కెన్ స్టార్ షిప్ లోకి వెళ్లేందుకు అనుమతించలేదని పవన్ చెపుతున్నారని... అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలని ప్రశ్నించారు. కెన్ స్టార్ షిప్ లోకి వెళ్లవద్దని పవన్ కు చంద్రబాబు చెప్పారా? అని అడిగారు. కాకినాడ పోర్ట్ యజమాని రాష్ట్ర ప్రభుత్వమని... అయినప్పటికీ అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.