ముంబయి మెట్రో రైలుపై 'పుష్ప'... వీడియో ఇదిగో!

  • అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప-2 ది రూల్
  • సుకుమార్ దర్శకత్వంలో హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్
  • డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్
  • ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్
పుష్పరాజ్ గా మరోసారి బాక్సాఫీసు దుమ్మురేపేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 ది రూల్ చిత్రంతో వస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ మూవీ డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

సినిమా రిలీజ్ కు మరి కొన్ని రోజుల సమయమే ఉండడంతో, చిత్రబృందం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో సినిమా ప్రమోషన్ చేపట్టింది. ఈ క్రమంలో, ముంబయి మెట్రో రైళ్ల పైనా పుష్ప-2 చిత్రాన్ని బ్రాండింగ్ చేస్తున్నారు. ముంబయి మెట్రో రైళ్లలో ప్రతి కంపార్ట్ మెంట్ పైనా పుష్ప-2 చిత్రం పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకుంది.


More Telugu News