నటి శోభిత ఆత్మహత్య కేసులో భర్త స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు

  • భార్యాభర్తల మధ్య విభేదాలు లేవని ప్రాథమిక విచారణలో గుర్తించిన పోలీసులు
  • చివరిసారి ఎవరెవరితో మాట్లాడిందనే కోణంలోనూ విచారణ
  • సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసులో పోలీసులు ఆమె భర్త సుధీర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల ఉన్నవారి స్టేట్‌మెంట్ కూడా తీసుకున్నారు. శోభిత ఆత్మహత్యపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రాథమిక దర్యాఫ్తులో భాగంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని గుర్తించారు. ఆమె మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా? ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె చివరిసారి ఎవరెవరితో మాట్లాడిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇంట్లో నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో "ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చావాలనుకుంటే యు కెన్ డూ ఇట్" అని రాసి ఉన్నట్లుగా వెల్లడించారు.

కర్ణాటకకు చెందిన శోభిత హైదరాబాద్‌లో స్థిరపడింది. బెంగళూరు మ్యాట్రిమోనిలో శోభిత ప్రొఫైల్‌ను చూసి సుధీర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమె సీరియల్స్‌లో నటించడం మానేసింది. పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది.


More Telugu News