సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్వల్ప అగ్నిప్రమాదం
- కోర్టు నెంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్
- తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది
- ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదన్న సుప్రీంకోర్టు సిబ్బంది
సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు నెంబర్ 11, కోర్టు నెంబర్ 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు వచ్చాయి. పొగ కారణంగా అక్కడ ఉన్న వారికి ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించారని సుప్రీంకోర్టు సిబ్బంది తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రకటించారు.